![]() |
![]() |
.webp)
గుప్పెడంత మనసు సీరియల్ ఐపోయినా కానీ రుషిదారా రోల్స్ ఆడియన్స్ ని వదలడం లేదు. దాంతో ఈ జోడి రాబోయే ఆదివారం విత్ స్టార్ మా పరివారం షోకి రాబోతున్నారు. ఆ ప్రోమో రీసెంట్ గా రిలీజ్ అయ్యింది. ఇక ఈ లేటెస్ట్ ఎపిసోడ్ కాన్సెప్ట్ ఏంటంటే డిజిటల్ స్టార్స్ వెర్సెస్ టీవీ స్టార్స్ . ఇక జోడీస్ గా గుప్పెడంత మనసు సీరియల్ యాక్టర్స్ రిషి - వసుధారా, పొదరిల్లు సీరియల్ నుంచి మహా, ఆషిక, మానస్, నవ్య స్వామి వచ్చారు. డిజిటల్ స్టార్స్ నుంచి సమీరా భరద్వాజ్, శ్రీహాన్, రాము రాథోడ్, విరాజిత వచ్చారు.
ఇక ఇందులో రిషి, వసు రొమాన్స్ మళ్ళీ ఆడియన్స్ ని అలరించబోతోంది. అది కూడా గీతా గోవిందం మూవీలోని సాంగ్ "ఏంటి ఏంటి ఈ వరస" సాంగ్ కి వసు రిషిని ఇమిటేట్ చేసింది. ఇక తర్వాత వసుధారను అమాంతం చేతుల్లోకి ఎత్తుకుని తిప్పాడు. తర్వాత వసు ఒక ఎల్లో రోజ్ ని రిషికి ఇచ్చింది. రిష్ అని వసు పిలిచేసరికి ఎప్పుడొచ్చావు రక్షా అని అడిగాడు చాలా రొమాంటిక్ గా ముకేశ్ . ఇక బ్యాక్ నుంచి మానస్ 7 . 30 కి వచ్చింది అని కామెడీగా ఆన్సర్ ఇచ్చాడు. దాంతో అందరూ నవ్వారు.
"నువ్వు నన్ను ఎంత మిస్ చేసుకున్నావో చెప్పు నిజం చెప్పు పర్లేదు " అంటూ వసు బుగ్గల్ని పుణికాడు రిషి. దాంతో వసు షాకైపోయింది. "ఎవరైనా చూస్తే నిజమే అనుకుంటారు " అంటూ గుసగుసలాడేసరికి వెనక నుంచి శ్రీముఖి వచ్చి "దొంగ పిల్లా" హా అంటూ వసుని రిషి మీద తోసేసింది. ఇక పొదరిల్లు హీరోయిన్ కృత్తికను పిలిచి "నీకే గనక టీవీ నా ఓటిటినా" అని అడిగితే అంటూ టీవీ మీద చెయ్యి పెడతావా ఓటిటి మీద చెయ్యి పెడతావా అంటూ ఇంటరెస్టింగ్ క్వశ్చన్ అడిగింది. టీవీ అని చెప్పేసరికి శ్రీముఖి గట్టిగా అరిచి హగ్ చేసేసుకుంది. వెంటనే హరి వచ్చి "డిజిటల్ గనక లేకపోతే మీకు ఫ్యాన్ పేజెస్ ఉన్నాయని మీకు తెలీదు మీకు ఇంతమంది ఫాన్స్ ఉన్నారని మీకు తెలీదు " అని చెప్పాడు. "ముందుగా టీవీ ఉంది కాబట్టి డిజిటల్ లో ఫ్యాన్ పేజెస్ వస్తున్నాయి " అని ఆన్సర్ ఇచ్చింది కృతిక.
ఇక శ్రీముఖి నవ్యస్వామితో ముచ్చట్లు పెట్టింది. "లైఫ్ లో ఎవరన్నా గ్రోత్ కోరుకున్నప్పుడే టీవీ నుంచి ఓటిటికి వెళ్తామని మాట మాట్లాడతారు " అని అడిగింది. అవినాష్ వెనక నుంచి "గ్రోత్ లేని వాళ్ళు " అనేసరికి శ్రీముఖి సీరియస్ లుక్ ఒకటి ఇచ్చింది. "నువ్వు నన్నంటున్నావా " అంటూ ఫైర్ అయ్యింది. ఇలా ఈ ప్రోమో ఫన్నీగా ఉంది. ఇక నెటిజన్స్ ఐతే రిషిధార మీద బోల్డు కామెంట్స్ చేశారు. "తెలుగు ఇండస్ట్రీలో రిషిధారని బీట్ చేసే కపుల్ ఉందా. వాళ్ళు పిలుస్తూనే ఉండండి. "రిషిధార"... ఇది ఒక పేరు మాత్రమే కాదు... ఎన్నో హృదయాల్లో శాశ్వతంగా నిలిచిపోయే ఒక అనుబంధం...కళ్ళతో మాత్రమే ఎన్నో భావాలను పలికించే మా అందమైన జంటను మళ్ళీ రెండు సంవత్సరాలు తరువాత చూడటం ఎంత సంతోషంగా ఉందో మాటల్లో చెప్పలేను " అంటూ రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు.
![]() |
![]() |